భారతదేశం, మే 23 -- క్రేజీ కలయికలో రెడీ అయిన సినిమా 'థగ్ లైఫ్'. మణిరత్నం, కమల్ హాసన్ చాలా కాలం తర్వాత కలిసి సినిమా కోసం పని చేశారు. సిలంబరసన్, త్రిష లాంటి స్టార్ క్యాస్టింగ్ తో మూవీ రెడీ అయింది. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. జూన్ 5న థియేటర్లలో రాబోతున్న ఈ సినిమా టీమ్ ప్రమోషన్లలో జోరు కొనసాగిస్తోంది. తాజాగా త్రిష.. థగ్ లైఫ్ గురించి మాట్లాడుతూ కమల్ హాసన్, మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. "శింబు, కమల్ సార్ ను చాలా కాలం నుంచి తెలుసుకుంటూనే ఉన్నా. కాబట్టి ఈ మూవీలో షూటింగ్ లో ఈజీగా అనిపించింది. నా సినీ జీవితంలో కమల్ హాసన్ సార్ నా మెంటర్. శింబుతో కలిసి రెండు సినిమాల్లో యాక్ట్ చేశా. మేము చాలా కాలంగా ఒకరికొకరం తెలుసు. అందుకే థగ్ లైఫ్ సెట్ లో...