Hyderabad, ఏప్రిల్ 25 -- కపుల్ గోల్స్ నెరవేర్చుకోవడంలో సెలబ్రిటీలు చాలా ఉత్సాహంగా ఉంటారు. మ్యారేజ్ యానివర్సరీలను ఎంతో అందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, ఆయన భార్య, ఒకప్పటి హీరోయిన్ షాలిని తమ 25వ పెళ్లి రోజును జరుపుకున్నారు.

హీరో అజిత్ కుమార్ తన భార్య శాలినితో కలిసి ఏప్రిల్ 24న తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ కుమార్, షాలిని వివాహబంధంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు కావొస్తోంది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అజిత్, షాలిని పెళ్లి వేడుకలు చేసుకున్నారు.

ఈ జంట సన్నిహితంగా మెలిగిన తమ పెళ్లి వేడుకల వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. చాలా సింపుల్‌గా కేక్ కట్ చేసి తమ 25వ పెళ్లి వేడుకను జరుపుకున్నారు ఈ హీరో హీరోయిన్. ఈ వీడియోలో ఒకరికొకరు కేక్ తినిపిస్తూ కనిపించారు. శాలి...