Hyderabad, జూన్ 26 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మనుషుల వాయిస్, ముఖాలను కూడా సృష్టించగలిగే ఈ రోజుల్లో, సెలబ్రిటీలు తప్పుడు సమాచారం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. నటి ప్రియాంక చోప్రా జోనస్ కూడా ఇలాంటి ఒక తప్పుడు ప్రచారానికి తాజాగా అడ్డుకట్ట వేసింది.

'ది బ్రీఫ్ ఇండియా' అనే పేజీ ప్రియాంక పేరుతో ఒక తప్పుడు కొటేషన్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. "భార్యగా కన్యత్వం ఉన్న అమ్మాయి కోసం వెతకొద్దు. మంచి ప్రవర్తన ఉన్న స్త్రీని చూసుకోండి. కన్యత్వం ఒక్క రాత్రిలో ముగుస్తుంది కానీ మర్యాద జీవితాంతం ఉంటుంది" అని ఆ కొటేషన్‌లో ఉంది.

తాను ఈ కామెంట్స్ చేసినట్లుగా వస్తున్న వార్తలపై ప్రియాంకా చోప్రా వెంటనే స్పందించింది. గురువారం (జూన్ 26) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ పోస్ట్‌ను ఖండించింది. "ఇది నేను చెప్పిన మాట కాదు, నా కొటేషన్ కాదు, నా వాయిస్ కా...