భారతదేశం, ఏప్రిల్ 20 -- 14 ఏళ్లకే వైభశ్ సూర్యవంశీ పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగుతోంది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా అతను హిస్టరీ క్రియేట్ చేశాడు. శనివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఔట్ అయిన తర్వాత అతను కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.

ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో ఆడడం ఏ యువ ఆటగాడికైనా కల లాంటిదే. ఈ లీగ్ లో సత్తాచాటితే నేషనల్ టీమ్ కు సెలక్ట్ కావొచ్చు, రూ.కోట్లు కొల్లగొట్టొచ్చు. అలాంటి ఛాన్స్ నే 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ కొట్టేశాడు. అంతటి ప్రెస్టేజియస్ లీగ్ లో ఆడే అవకాశం రావడంతో వైభవ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. క్రీజులో అడుగుపెట్టి భారీ షాట్లు ఆడిన అతను ఔటయ్యాక కన్నీళ్లు అదుపు చేసుకోలేకపోయాడు.

మార్ క్రమ్ బౌలింగ్ లో వైభవ...