భారతదేశం, మే 19 -- మంచు కుటుంబంలో కొన్ని రోజులుగా ఆస్తి గొడవలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది. తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణుతో మంచు మనోజ్ పోరాడుతున్నారు. దాడులు, పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ మళ్లీ సినిమాల్లోకి 'భైవరం'తో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్‍తో కలిసి మరో హీరోగా మనోజ్ నటించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏలూరులో జరిగింది. ఈ ఈవెంట్‍లో మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

చాలా కాలం తర్వాత తన సినిమా ఈవెంట్ జరుగుతుండటంతో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ ఎక్కక ముందే తన 'ఏవీ'ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న దర్శకుడు విజయ్ కనకమేడల, హీరో నారా రోహిత్.. మనోజ్‍ను ఓదార్చారు. కన్నీళ్లు తుడుకుంటూనే మళ్లీ ఏడ్...