భారతదేశం, మే 26 -- హీరో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో ఈ చిత్రంలో నటించారు విష్ణు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కూడా ఈ చిత్రంలో నటించారు. అయితే, ఈ సినిమాలో వారి స్క్రీన్‍టైమ్ ఎంత ఉంటుందనేది చాలా మందిలో ఉత్కంఠగా మారింది. ఆ వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు వెల్లడించారు.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ స్క్రీన్‍టైమ్ సుమారు 30 నిమిషాలు ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్‍ది చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పారు. ట్రిమ్ చేసిన తర్వాత కూడా ప్రభాస్ స్క్రీన్‍టైమ్ సుమారు అరగంట ఉందని క్లారిటీ ఇచ్చారు విష్ణు. ఈ చిత్రంలో మోహన్‍లాల్ సుమారు 15 నిమిషాలు కనిపిస్తారని, ఆయనది కూడా కీలకమైన ర...