భారతదేశం, జూన్ 30 -- భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన కన్నప్ప సినిమా హీరో మంచు విష్ణుకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. కానీ సినిమా లెవల్ ను బట్టి చూస్తే కలెక్షన్లు మాత్రం తక్కువే. జూన్ 27న రిలీజైన ఈ మూవీకి ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. పైగా ఆదివారం (జూన్ 29) కలెక్షన్లు పడిపోవడం గమనార్హం.

ముకేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలై తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ను అందించింది. కానీ ఈ చిత్రం హనుమాన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బీట్ చేయడంలో విఫలమైంది. ఇండియాలో కన్నప్ప సినిమా మూడు రోజుల్లో రూ .22.53 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది.

సక్నిల్క్ ప్రకారం ఆదివారం కన్నప్ప కలెక్షన్లలో మరింత తగ్గాయి. సండే ఈ మూవీ ఇండియాలో రూ .6.03 కోట్ల నెట్...