Hyderabad, జూన్ 26 -- విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'కన్నప్ప' మూవీ రేపే అంటే జూన్ 27న విడుదల కాబోతోంది. శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప పురాణగాథ ఆధారంగా రూపొందిన ఈ పౌరాణిక ఫాంటసీ థ్రిల్లర్‌ను ఇప్పటికే కొందరు మీడియా సభ్యులకు చూపించారు. అక్కడి నుంచి పలువురు ఇచ్చిన రివ్యూలు చూస్తే.. ఈ మూవీ థియేటర్లలో ఓ అద్భుతమైన అనుభూతిని పంచనున్నట్లు తెలుస్తోంది.

కన్నప్ప మూవీపై ఫస్ట్ రివ్యూలు బుధవారం (జూన్ 25) రాత్రి నుంచే ఎక్స్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ కూడా తన రివ్యూ ఇచ్చాడు. "చివరి 30 నిమిషాలు నా మనసు నుండి వెళ్లడం లేదు. ఇలాంటి తీవ్రమైన అనుభూతి నాకు కాంతార క్లైమాక్స్ సమయంలోనే కలిగింది. ప్రేక్షకులు ముఖ్యంగా శివ భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు. క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టించేదిగా, భావోద్వేగభరితంగా, గూ...