Hyderabad, జూన్ 12 -- మంచు విష్ణు తొలి పాన్ ఇండియా మూవీ కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (జూన్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా మంచు విష్ణు వెల్లడించాడు. దీంతో ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ ట్రైలర్ రానుంది.

కన్నప్ప మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం (జూన్ 13) ఇండోర్ లో జరగాల్సి ఉంది. అయితే ఈ పెను విషాదం నేపథ్యంలో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని విష్ణు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.

"అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి నా గుండె పగిలింది. ఈ విషాదం నేపథ్యంలో రేపు ఇండోర్లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నాం. ఒక రోజు ఆలస్యంగా కన్నప్ప ట్రైలర్ రానుంది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని విష్ణు ట్వీట్ చేశాడు....