భారతదేశం, జూన్ 16 -- ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న భారీ ప్రాజెక్టుల్లో కన్నప్ప ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ ఓటీటీ రైట్స్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయని తెలిసింది.

కన్నప్ప డిజిటల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో తిన్నడుగా మంచు విష్ణు నటించారు. మోషన్ బాబు, శరత్ కమార్, ప్రభాస్, ముకేష్ రిషి, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితర స్టార్లు ఈ సినిమాలో ...