భారతదేశం, జూన్ 27 -- ఓ వైపు వివాదాలు.. మరోవైపు ట్రోల్స్.. ఇలాంటి పరిస్థితుల్లో భారీ అంచనాల నడుమ థియేటర్లకు వచ్చింది కన్నప్ప మూవీ. ఈ రోజు (జూన్ 27) థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అనే ప్రశ్న రేకెత్తుతోంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఇంకా అమ్మలేదు. కన్నప్ప డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కన్నప్ప రైట్స్ కోసం పోటీపడుతున్నాయని టాక్. దీంతో రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది.

కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ పైనా బజ్ నెలకొంది. సాధారణంగా...