Hyderabad, జూన్ 18 -- పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతున్న మూవీ కన్నప్ప. ఇందులో మంచు విష్ణు లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ద్వారానే విష్ణు చిన్న కుమారుడు అవ్రామ్ (7) ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. దీనిపై విష్ణు తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాలలో ఒకటి అని విష్ణు అన్నాడు.

విష్ణు మంచు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక తెరవెనుక (BTS) వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో అవ్రామ్ సినిమా సెట్‌లో ఎంతో చురుగ్గా అటూ ఇటూ తిరుగుతూ, తాను నటించిన సీన్లను చూసుకుంటూ కనిపిస్తున్నాడు. అవ్రామ్ తన తండ్రితో మాట్లాడుతూ, కాస్ట్యూమ్‌లు వేసుకుంటూ, తన డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

ఈ వీడియోను విష్ణు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఏడేళ్ల వయసులోనే తెరంగేట్రం చేస్తున్న తన కొడుకుని...