భారతదేశం, ఏప్రిల్ 18 -- పిల్లలకు చిన్న గాయమైతే తట్టుకోలేని కన్నతల్లి.. తన చేతులతోనే వారికి మరణ శాసనం రాసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు కుమారులను కిరాతకంగా కత్తితో నరికిచంపింది. ఆ తర్వాత ఐదందస్థుల భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ హృదయవిదార ఘటన హైదరాబాద్ జీడిమెట్లలోని గాజులరామారంలో జరిగింది. పిల్లలకు శ్వాసకోస సమస్య, తనకు కళ్ల సమస్య ఉండడంతో మానసికంగా కుంగిపోయిన తల్లి.. ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేష్‌ హెయిట్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌నంబర్‌ 204లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లు...