భారతదేశం, డిసెంబర్ 23 -- ఓటీటీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అదరగొడుతోంది. ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. అదే 'దివ్య దృష్టి'. కమెడియన్ సునీల్ క్రూరమైన విలన్ గా నటించిన సినిమా ఇది. ఇది డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైంది. అదిరిపోయే ట్విస్ట్ తో లాస్ట్ లో థ్రిల్ పంచే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

సునీల్, ఈషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ దివ్య దృష్టి. ఇది డిసెంబర్ 19న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ ఓటీటీలో ఇండియాలో నంబర్ వన్ సినిమాగా దివ్య దృష్టి స్ట్రీమింగ్ అవుతోంది.

సునీల్ అంటే ఒకప్పటి టాప్ కమెడియన్. తన మార్కు కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు. ఆ తర్వాత హీరోగా ఓ టర్న్ తీసుకున్న...