భారతదేశం, సెప్టెంబర్ 6 -- బాక్సాఫీస్ ను షేక్ చేసిన కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' ఇప్పుడు ఓటీటీ అరంగేట్రం చేయనుంది. తక్కువ ప్రీ రిలీజ్ బజ్ తో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు రూ.78 లక్షలు వసూలు చేసి అనతికాలంలోనే అదరగొట్టే సెన్సేషన్ గా మారింది. కేవలం రెండు వారాల్లోనే ఇండియాలో రూ.43 కోట్ల నెట్ ను క్రాస్ చేసి వరల్డ్ వైడ్ గ్రాస్ లో రూ.120 కోట్లకు పైగా వసూలు చేసి, ఇటీవలి కాలంలో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా అవతరించింది.

కన్నడలో చిన్న సినిమాగా వచ్చిన హారర్ థ్రిల్లర్ సు ఫ్రమ్ సో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. దీంతో ఈ మూవీ మలయాళం, తెలుగులోనూ డబ్ అయి థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఓటీటీ రిలీజ్ కూడా కన్ఫామ్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 9న డిజిటల్ ప్రీమియర్ కానుంది. జియోహాట్‌స్టార్‌లోకి మరో మ...