భారతదేశం, జూన్ 18 -- మేఘాలయ హనీమూన్ హత్యను గుర్తు చేసేలా మరో హత్య రాజస్థాన్ లోని అల్వార్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడు, కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి భర్తను హత్య చేసింది. రాజా రఘువంశీ హత్య జాతీయ పతాక శీర్షికలకు రావడానికి కొద్ది రోజుల ముందు జూన్ 7న జిల్లాలోని ఖేర్లీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే, మేఘాలయ హత్య మాదిరిగా కాకుండా, ఈ కేసులో ఒక సాక్షి ఉన్నాడు. అది ఆ మహిళ యొక్క తొమ్మిదేళ్ల కుమారుడు.

తన ప్రియుడు, కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి భర్తను హత్య చేసిన అనంతరం తన భర్త మాన్ సింగ్ జాతవ్ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి నిందితురాలైనన అనిత చెప్పింది. అయితే వారి కుమారుడు తాను ప్రత్యక్ష సాక్షిగా చూసిన విషయం చెప్పడంతో బాధితుడు మాన్ సింగ్ జాతవ్ మరణం వెనుక అసలు వాస్తవం బయటపడింది.

ఈ కేసులో ప్రధ...