Hyderabad, ఆగస్టు 23 -- కీలక పాత్రల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకన్నారు నటుడు రాజీవ్ కనకాల. ఇటీవల కాలంలో తండ్రి పాత్రలో కనిపిస్తున్న రాజీవ్ కనకాల నటించిన లేటెస్ట్ సినిమా చాయ్ వాలా. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చాయ్ వాలా సినిమాలో రాజీవ్ కనకాల టీ హోటల్ యజమానిగా నటించాడు.

చాయ్ వాలా సినిమాలో హీరోగా శివ కందుకూరి చేయగా హీరోయిన్‌గా తేజు అశ్విని చేస్తోంది. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు చాయ్ వాలా సినిమా నిర్మించారు. ప్రమోద్ హర్శ రచన, దర్శకత్వం వహించిన చాయ్ వాలా టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా చాయ్ వాలా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరో తండ్రి, నిర్మాత రాజ్ కందుకూరితోపాటు సినిమా విశేషాలు చెప్పారు. ...