భారతదేశం, నవంబర్ 20 -- సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా వినపడుతుంటాయి. ఎంతపెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవాన్ని చూసి ఉంటారు. అయితే, రీసెంట్‌గా సీరియల్స్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పింది.

కాస్టింగ్ కౌచ్ గురించి సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. అపూర్వ ముఖిజా హోస్ట్‌గా చేస్తున్న స్పైస్ ఇట్ అప్ అపూర్వతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మౌనీ రాయ్‌కు ప్రశ్న ఎదురైంది. తాను కాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ 21 ఏళ్లలో జరిగిన దారుణ సంఘటనను గుర్తు చేసుకుంది మౌనీ రాయ్.

"బాలీవుడ్‌లో నేను ఎప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడూ ఎదుర్కోలేదు కానీ, నాకు ఒకసారి చేదు అనుభవం మాత్రం ఎదురైంది. నాతో అతను అసభ్యకరంగ...