భారతదేశం, అక్టోబర్ 28 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫైట్ మరింత టఫ్ గా మారుతోంది. ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ హోరాహోరీగా సాగింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి బిగ్ బాస్ లో ఉన్న వాళ్లను నామినేట్ చేశారు. ఈ వారం నామినేషన్లలో 8 మంది కంటెస్టెంట్లున్నారు. ఓటింగ్ చూస్తే సీరియల్ హీరోయిన్ మళ్లీ టాప్ లోనే కొనసాగుతోంది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎనిమిది వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్లలో 8 మంది కంటెస్టెంట్లున్నారు. ఇందులో తనుజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సంజన గల్రానీ, రాము రాథోడ్, మాధురి దువ్వాడ, రీతు చౌదరి, గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్ హౌస్ నుంచి వెళ్లిపోయేందుకు నామినేట్ అయ్యారు.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ ఏడు వారాల్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్లు వచ్చి, ఇప్పుడు...