భారతదేశం, ఏప్రిల్ 27 -- బ్లాక్ హిల్స్.. ఈ ఏరియా మావోయిస్టులకు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భద్రతా బలగాలు భావిస్తాయి. అందుకే 5 రోజులుగా కర్రెగుట్టల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కర్రెగుట్టల్లోకి దూసుకెళ్తున్నారు. అయితే.. కాస్త చీకటిపడినా.. ఏం కనిపించడం లేదు. ఇలాంటి చోట ఆపరేషన్‌ నిర్వహించడం బలగాలకు కత్తిమీద సాములా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

1.శుక్రవారం రాత్రి కర్రెగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో కల్లోలంగా మారిందని.. చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి హెలికాప్టర్లు నిరంతరం తిరుగుతున్నాయని చెప్పారు.

2.ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని.. ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజా...