Hyderabad, అక్టోబర్ 10 -- విశ్వక్సేన్ నెక్ట్స్ మూవీ ఫంకీ (Funky) టీజర్ వచ్చేసింది. జాతిరత్నాలు సినిమాతో తెగ నవ్వించిన అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా నవ్వులు పంచబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. పైగా అనుదీప్, విశ్వక్సేన్ కాంబినేషనే ఎంతో ఆసక్తి రేపుతోంది. విశ్వక్ తో తన మార్క్ కామెడీని అనుదీప్ చూపించబోతున్నాడు.

సింపుల్ గా, జనానికి సులువుగా అర్థమయ్యే కామెడీకి అనుదీప్ పెట్టింది పేరు. జోగిపేట అనే చిన్న ఊళ్లో జాతిరత్నాలు అనే సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అతడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు విశ్వక్సేన్ తో ఫంకీ అనే సినిమా తీస్తున్నాడు. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 10) ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ మళ్ళీ అనుదీప్ మార్క్ కామెడీని తీసుకొచ్చింది.

మంచి పంచ్ లతో నిండిన ఈ టీజర్ మొత్తం సరదాగా సాగిపోయింది. ఈ కథ సినిమా నిర్మాణ ప్రపంచం నేపథ...