భారతదేశం, మే 11 -- ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాల నడుమ ముగిశాయి. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీ నాయక్ భౌతికకాయాన్ని ప్రముఖులు సందర్శించి.. అశ్రునివాళులు అర్పించారు. మురళీనాయక్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు.

అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. మురళీ నాయక్ స్నేహితులు, బంధువులను పరామర్శించారు. యుద్ధానికి ముందు వీరజవాన్ మురళీ నాయక్ బంధువు, స్నేహితుడు రాజశేఖర్ తో జరిపిన వాట్సాప్ చాట్ ను లోకేష్ పరిశీలించారు. మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు.

వీరజవాన్ మురళీ నా...