భారతదేశం, జూలై 8 -- కడప: కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడంతో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆమె పూర్తి మద్దతు తెలిపారు. ఈ విషయంపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, ముఖ్యంగా తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిర్లక్ష్యం వహించారని షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

"COA (కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్) అనుమతి లేకుండా విద్యార్థులను ఎలా చేర్చుకున్నారు? ఈ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇది జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తప్పే...