Hyderabad, ఫిబ్రవరి 14 -- కందిపప్పు పచ్చడి రుచి పాతతరం వాళ్లకి తెలుస్తుంది. కొత్త తరంలో ఈ పచ్చడిని తిని చేసుకుని తినే వారి సంఖ్య తక్కువే. సాంబారుగా, పప్పుగా మాత్రమే కందిపప్పును వినియోగిస్తారు. నిజానికి కందిపప్పుతో టేస్టీ పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి వేసి స్పైసీగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కందిపప్పు పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కందిపప్పు - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

జీలకర్ర - రెండు స్పూన్లు

ఎండుమిర్చి - పది

వెల్లుల్లి రెబ్బలు - పది

కరివేపాకులు - గుప్పెడు

చింతపండు - ఉసిరికాయ సైజులో

నీళ్లు - సరిపడినన్ని

నూనె - రెండు స్పూన్లు

ఆవాలు - అర స్పూను

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.

2. అందులో ఎండుమిర్చిని వేసి వేయించాలి.

3. అలాగే కరివేపాకులు, జ...