Hyderabad, సెప్టెంబర్ 5 -- సాహో, పంజా, శక్తి సినిమాల్లో అలరించిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ నటించిన లేటెస్ట్ మూవీ బాఘీ 4. 2016లో వర్షం సినిమాకు రీమేక్‌గా వచ్చిన బాఘీ ఫ్రాంచైజీలో నాలుగో సినిమాగా బాఘీ 4 తెరకెక్కింది.

మోస్ట్ వయెలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా బాఘీ 4 సినిమాను దర్శకనిర్మాతలు రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇదివరకు బాఘీ సినిమా ఫ్రాంచైజీలో లేనంతా రక్తపాతం, హింసాత్మక ఫైట్ సీన్లతో బాఘీ 4 నిండిపోయింది. అయితే, బాఘీ 4 మేకర్స్‌కు సెన్సార్ బోర్డ్ పెద్ద షాకే ఇచ్చింది. ఏకంగా 23 సీన్ల కోతకు గురి చేసింది.

బాలీవుడ్ హంగామా రిపోర్ట్స్ ప్రకారం ఆడియోతోపాటు 23 సన్నివేశాలను తొలగించాలని బాఘీ 4 మేకర్స్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ...