Hyderabad, మే 6 -- వేసవి తాపానికి చర్మంతో పాటు జుట్టు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. వేడి, చెమటతో పాటు హానికరమైన యూవీ కిరణాలు, దుమ్ము, ధూళి కలగలిసి వెంట్రుకలు పొడిగా, నిర్జీవంగా తయారవుతాయి.చూడటానికి ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు చాలా మంది కండీషనర్ వాడుతుంటారు. అయితే మార్కెట్లో దొరికే కండషనర్లతో ఈ ససమ్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే మీరు పొరపడినట్లే.ఎందుకుంటే వాటి తయారీలో హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల మేలు కన్నా ఎక్కువ హానే కలుగుతుంది.

వెంట్రుకలకు కానీ చర్మానికి కానీ ఎల్లప్పుడూ సహజమైన పదార్థాలను ఉపయెగించడం చాలా మంచిది. అలాగే వీటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు మెరుగైన ఫలితాలను పొందచ్చు. అలాంటి వాటిలో ఒకటే ఈ బాదం-అలోవెలా కండీషనర్. ఇది మీ...