Telangana,hyderabad, ఏప్రిల్ 17 -- హైదరాబాద్ యూనివర్శిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములపై వివాదం కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి పనులు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో. ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. మరోవైపు ఈ భూముల వ్యవహారంలో ఐఏ జనరేటెడ్ ఫొటోను వైరల్ చేసిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై లోతుగా విచారించాలని నిర్ణయించటంతో.. ఆ దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.

ఏఐ జనరేటెడ్ ఫొటోను సృష్టించటంతో పాటు షేర్ చేసిన ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు ఖాతాలను గుర్తించారు. ఇందులో కొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే. సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు కూడా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మార్చి 31వ తేదీన స్మితా సబర్వాల్ ఎర్త్ మూవింగ్ మెషిన్లు, రెండు జింకలు, ఒక నెమలితో కూడిన ఫొటోను ...