భారతదేశం, ఏప్రిల్ 30 -- కంచిపీఠం పరంపరలో భాగంగా బాధ్యతలు స్వీకరించేందుకు స్వామిజీకి సన్యాస దీక్షను స్వీకరించారు. కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిజీ పేరును అధికారికంగా ప్రకటించారు.

కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ను కొద్ది రోజుల క్రితం ఎంపికయ్యారు. గత వారం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారసుడిపై ప్రకటన చేశారు. ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సన్యాస దీక్ష ప్రసాదించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.

కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో సన్యాస దీక్ష ధారణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామాక్షి అమ్మవారి ఆలయం నుంచి శ్రీ ...