భారతదేశం, ఏప్రిల్ 26 -- తమిళనాడులోని ప్రఖ్యాత కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరానికి చెందిన 27 ఏళ్ల పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న ఆయనకు సన్యాస దీక్షను ఇవ్వనున్నారు. ఈ మేరకు కంచి కామకోటి పీఠం నుంచి ప్రకటన వెలువడింది.

ధన్వంతరి, మంగాదేవిల పెద్ద కుమారుడైన గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించారు. వేదాలు, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించారు. ఈయన కొన్ని రోజులు తెలంగాణ బాసరలో సేవలందించారు.

ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా గణేశశర్మకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. గణేశశర్మ(27) కాకినాడ జిల్లాలోని అన్నవరానికి చెందినవారు. పూర్తి పేరు. సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రావిడ్‌. ఆయన తండ్రి అన్నవరం ఆలయంలో పురోహి...