భారతదేశం, జనవరి 29 -- భోజనం తినేటప్పుడు కొన్ని నియమాలని చాలా మంది పాటిస్తూ ఉంటారు. అలాగే భోజనాన్ని వడ్డించుకునేటప్పుడు కూడా చాలా మంది పెద్దలు ముందు అన్నం పెట్టకూడదని చెప్పడం మీరు వినే ఉంటారు. నిజానికి భోజనం వడ్డించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు. ముఖ్యంగా అన్నాన్ని కంచం లేదా విస్తరిలో ముందు వడ్డించడం మంచిది కాదు. దాని వెనుక కారణమేంటి? ఎందుకు అన్నాన్ని ముందు పెట్టకూడదని పెద్దలు చెప్తారు? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన పూర్వికులు పాటిస్తున్న పద్ధతులను ఇంకా పాటిస్తున్నాము. చాలా మంది కొన్ని పొరపాట్లు తెలియక చేస్తూ ఉంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే భోజనం అనేది ఒక యజ్ఞం వంటిది. పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. పెద్దలు విస్తరిలో ముందుగా అన్నం వడ్డించకూడదని చెప్పడానికి గల కారణాలు ఏంటి అనే దానిని ఇప్పుడు తెలుసుక...