భారతదేశం, డిసెంబర్ 20 -- హిందీలో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా మారిపోయింది హీరోయిన్ రాధికా ఆప్టే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ యాక్టింగ్ తో తీరిక లేకుండా గడిపేస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన సాలీ మొహబ్బత్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రాధికా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. సాలీ మొహబ్బత్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ సైజ్ లు పెంచేందుకు ప్యాడింగ్ చేసుకోమన్నారని చెప్పింది. చాలా పెద్దగా కనిపించేలా చేయాలని చెప్పారని, అది తనకు ఇబ్బందిగా అనిపించిందని రాధికా ఆప్టే పేర్కొంది.

ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ.. ''సౌత్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన సిని...