భారతదేశం, జనవరి 8 -- ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులను ఇప్పటికే ప్రకటించింది. అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ప్రణాళికలు వేసింది ఆర్టీసీ. ఇదే సమయంలో మరో విషయం తెరపైకి వచ్చింది. ఆర్టీసీలోని 2,419 అద్దె బస్సుల యజమానులు ఈ నెల 12 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లుగా తెలుస్తోంది.

అద్దె పెంచాలని అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళల ఉచిత ప్రయాణంతో పడిన అదనపు భారం మేరకు చెల్లింపులు చేయాలని అడుగుతున్నారు. నష్టాలు వస్తున్న కారణంగా తమకు అద్దె పెంచాలని చెబుతున్నారు. ఒకవేళ అద్దె పెంచకపోతే.. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యజమానుల...