భారతదేశం, మే 13 -- హైదరాబాద్ ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్ అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ముంబయిలో రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి జీవన్‌లాల్ చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐకి కీలక అంశాలు తెలిశాయి.

జీవన్ లాల్ ముంబయికి చెందిన ఎన్‌డీడబ్ల్యూ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.2.5 కోట్ల విలువైన ప్లాట్‌ను లంచంగా తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ప్లాట్ ను ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్‌ వెంకటేశ్వరుల పేరిటరిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.

ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు, 2004 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన జీవన్ లాల్ రూ.70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేస్తోన్న జీవన్ లాల్ ఓ ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా, మధ్యవర్తుల ద్వారా లంచం...