భారతదేశం, జనవరి 29 -- మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ బాస్ గా నిలుస్తున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు.

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాస్ వసూళ్లు రూ.350 కోట్లు దాటాయి.

విదేశాల్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ అదరగొడుతోంది. ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ....