భారతదేశం, మే 11 -- రాష్ట్రంలో మే 12వ తేదీన 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 29 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 41 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆదివారం (మే 11న) ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని తెలిపింది.

మరోవైపు సోమవారం (మే 12న) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించార...