Hyderabad, సెప్టెంబర్ 23 -- పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి వరుస ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదటి నుంచీ మూవీకి సంబంధించి అన్నీ ఆలస్యంగానే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రైలర్ విడుదల 24 గంటలకు పైగా ఆలస్యం అయిన తర్వాత ఇప్పుడు సినిమా డెలివరీలో కూడా ఆలస్యం జరుగుతోందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అసంతృప్తిగా ఉన్నారు.

పవన్ కల్యాణ్ ఓజీ సినిమా యూరప్ డిస్ట్రిబ్యూటర్ అయిన 4 సీజన్స్ క్రియేషన్స్ సోషల్ మీడియాలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. "చాలా కాలంగా మేము కంటెంట్ డెలివరీ ఆలస్యం వల్ల నష్టపోతున్నాము. ఒకవైపు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఫిర్యాదులు వింటున్నాము. కానీ 'ఓజీ'లాంటి పెద్ద సినిమాకు కూడా కంటెంట్ చివరి నిమిషంలో డెలివరీ అయితే ప్రేక్షకులు ఎలా వస్తారు?" అని వాళ్ళు ప్రశ్నించారు.

"ఇద...