భారతదేశం, మే 21 -- కాకతీయ వంశానికి చెందిన మహరాజు కమల్ చంద్ర భంజ్‌ దేవ్‌ కాకతీయ పర్యటనలో భాగంగా ఓరుగల్లు నగరానికి వచ్చి హనుమకొండలోని వేయి స్తంభాల గుడితోపాటు భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొద్దిరోజుల కిందటే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న సుందరీమణులు వేయి స్తంభాల గుడిని సందర్శించి వెళ్లగా.. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాకతీయుల రాజైన కమల్ చంద్ర భంజ్ దేవ్ వరంగల్ లో పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది.

కమల్ చంద్ర భంజ్ దేవ్ మంగళవారం ఉదయం వరంగల్ నగరానికి చేరుకోగా.. మొదట బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమల్ చంద్ర భంజ్ దేవ్ నేరుగా వినయ్ భాస్కర్ తో కలిసి తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి అమ్మవారి ఆలయానిక...