Telangana,hyderabad, ఏప్రిల్ 24 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష - 2025 లకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గురువారం (ఏప్రిల్ 25) నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు. అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి. ప్రతిరోజూ మూడు సెషన్లు ఉంటాయి. ఉదయం సెషన్ 09.30 గంటల నుంచి 11.00 గంటల మధ్య ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 12.30 to 02.00 గంటల వరకు, మూడో సెషన్ 03.30 గంటల నుంచి 05.00 గంటల మధ్య నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు.

అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధు...