Hyderabad, ఏప్రిల్ 19 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష - 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.

ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు. అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే క్వాలిఫై అయినట్లు గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది.

ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ,ఫ్యాకల్...