Telangana,hyderabad, ఆగస్టు 24 -- ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2025 - 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్ 1 కింద అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా యూజీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా. తాజాగా అధికారులు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15 వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.

అన్ని కలిపి 28 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు కోర్సు వ్యవధి ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సర...