భారతదేశం, డిసెంబర్ 2 -- ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదవుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. విజ్ఞాన్‌ అనే యువకుడు ఆక్సిజన్‌ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మృతుడి స్వస్థలం హుజూరాబాద్‌గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా. మృతుడు తన స్వగ్రామంలో జరిగిన సంఘటన గురించి ఓ మేసేజ్ ను రాసినట్లు గుర్తించారు. గ్రామంలో జరిగిన ఘటనపై తల్లిదండ్రులు. అతడిని తిట్టినట్లు ఆ సందేశంలో ఉంది. ప్రవర్తనను మార్చుకోకపోతే గ్రామంలో ఉండవద్దని తల్లిదండ్రులు అతనికి చెప్పారని ఆ సందేశంలో రాశాడు. తన కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదని. తాను చని...