భారతదేశం, డిసెంబర్ 5 -- ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఎంత మొత్త‌మైనా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌మ‌ని తెలిపారు.

ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. యూనివ‌ర్సిటీలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై తొలుత అధికారులు వివ‌రించారు. అనంత‌రం ప‌నుల‌కు సంబంధించిన వివిధ మోడ‌ళ్ల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్స్‌ను ముఖ్యమంత్రి వీక్షించారు.

హాస్ట‌ల్ భ‌వ‌నాలు, ర‌హ‌దారులు, అక‌డ‌మిక్ బ్లాక్స్‌, ఆడిటోరియం నిర్మాణాల‌కు సంబంధించి ప‌లు మార్పులు చేర్పుల‌ను సూచించారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో ప‌నుల‌కు అర్బ‌న్ ఫారెస్ట...