భారతదేశం, డిసెంబర్ 7 -- తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజుల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 26 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు. రూ.25 ఫైన్‌‌‌‌‌‌‌‌తో (ఒక్కో పేపర్‌‌‌‌‌‌‌‌కు) ఈనెల 27 నుంచి జనవరి 2 వరకు, రూ.50 ఫైన్‌‌‌‌‌‌‌‌తో (ఒక్కో పేపర్‌‌‌‌‌‌‌‌కు) జనవరి 3 నుంచి 7 వరకు ఫీజు వరకు అవకాశం ఉంటుంది. ఈ ఫీజులను https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్ ద్వారా చెల్లించుకోవచ్చు.

మరోవైపు తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చింది. అడ్మిషన్ల గడువును డిసెంబర్‌ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం ...