Telangana,hyderabad, జూలై 13 -- తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువు ముగియగా.. అధికారులు మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.

వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను(2025-26) 10వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు పొందుతారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఇక ఇంటర్ లో ప్రవేశం పొందేందుకు ...