భారతదేశం, జూలై 11 -- ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలకు షాక్​ ఇస్తున్న ఓపెన్‌ఏఐ సంస్థ, త్వరలో తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది! ఇది ఈ ఏడాదిలోనే లాంచ్​ అవ్వొచ్చు. ఈ విషయం రాయిటర్స్ వార్తా సంస్థ ద్వారా వెల్లడైంది. చాట్‌బాట్‌లు, ఏఐ టూల్స్‌తో ఇప్పటికే తన ప్రభావాన్ని చాటుకున్న ఓపెన్‌ఏఐ, ఇప్పుడు ప్రజలు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్‌, దానితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే విషయంలో కూడా పట్టు సాధించాలని చూస్తోంది. ఈ కొత్త బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఆధిపత్యానికి నేరుగా సవాల్ విసిరే అవకాశం ఉంది.

సాధారణ బ్రౌజర్‌లు కేవలం వెబ్‌సైట్‌లకు గేట్‌వేలుగా పనిచేస్తే.. ఓపెన్‌ఏఐ కొత్త బ్రౌజర్, బ్రౌజింగ్ అనుభవంలోనే ఏఐని చొప్పించనుంది. దీని ముఖ్య ఉద్దేశం.. వినియోగదారుల ఇంటరాక్షన్‌లను చాట్‌జీపీటీ తరహా చాట్ ఇంటర్‌ఫ...