భారతదేశం, ఏప్రిల్ 19 -- స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన ఓదెల 2 చిత్రం ఈ గురువారం ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాపై ముందు నుంచి ఎక్కువగా క్రేజ్ ఉంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీలో తమన్నా నటించడం, పాపులరైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్ రావటంతో అంచనాలు బాగా ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక ఓదెల 2కు ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఈ క్రమంలో వీకెండ్‍లోనూ ఈ మూవీకి భారీ నిరాశ ఎదురైంది.

ఓదెల 2 మూవీ ఊహించని విధంగా నెగెటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో తొలి రెండు రోజులు అనుకున్న దాని కంటే బాగా కలెక్షన్లు తక్కవగా వచ్చాయి. అయితే, వీకెండ్ అయిన నేడు శనివారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పుంజుకుంటుదేమోనని మూవీ టీమ్ ఆశించింది. కానీ వీకెండ్ అయినా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ వీకెండ్‍లోనూ భారీగా పడిపోయింది....