భారతదేశం, జనవరి 1 -- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. డఫర్ బ్రదర్స్ సృష్టించిన అద్భుత మాయా ప్రపంచం 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) ఆఖరి ఎపిసోడ్ డిసెంబర్ 31న విదేశాల్లో, జనవరి 1న ఇండియాలో విడుదలైంది.

అయితే, స్ట్రేంజర్ థింగ్స్ 5 ఫైనల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త ఏడాది తీపి జ్ఞాపకాన్ని అందించాల్సింది పోయి తీవ్ర నిరాశను మిగిల్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఓటీటీ సిరీస్ క్లైమాక్స్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ చూడటానికి జనం ఒక్కసారిగా ఎగబడటంతో నెట్‌ఫ్లిక్స్ యాప్ కాసేపు మొరాయించింది. ఆ అడ్డంకిని అధిగమించి సిరీస్ చూసిన ఫ్యాన్స్‌కు క్లైమాక్స్ పెద్ద షాక్ ఇచ్చింది.

కథను ముగించిన తీరు అత్యంత సాధారణంగా ఉందని, ప్రతి సన్నివేశాన్ని ముందే ఊ...