Hyderabad, సెప్టెంబర్ 19 -- ఓటీటీలో రీసెంట్‌గా వచ్చి క్రేజీ సిరీస్‌లో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఒకటి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టోరియల్ డెబ్యూ చేసిన ఓటీటీ సిరీస్ ఇది. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్‌లో షారుక్ ఖాన్ నుంచి దిశా పటానీ వరకు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు నటించారు.

అయితే, ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మిల్కీ భామ తమన్నా భాటియా హాట్ సాంగ్ గఫూర్ లేకపోవడంపై అభిమానులు, ఆడియెన్స్ తెగ నిరాశ చెందుతున్నారు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్ నుంచి గఫూర్ పాటను ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ పెట్టారు.

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌పై క్రేజ్ పెరగడానికి తమన్నా నర్తించిన గఫూర్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ పాటలో తన అందచందాలతో కట్టిపడేసింది తమన్నా. దీంతో ఈ సిరీస్‌కు మంచి బజ...