Hyderabad, ఆగస్టు 3 -- బాలీవుడ్ పాపులర్ నటీమణుల్లో దివ్యా దత్తా ఒకరు. విభిన్న పాత్రలతో, అద్భుతమైన నటనతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది దివ్యా దత్తా. ఛావా, భాగ్ మిల్కా భాగ్, స్లీపింగ్ పార్టనర్, బద్లాపూర్, బాబుమొషాయి బందూక్‌బాజ్ వంటి ఎన్నో బాలీవుడ్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది దివ్యా దత్తా.

హిందీలో మంచి క్రేజ్ ఉన్న ఈ 47 ఏళ్ల బ్యూటి దివ్యా దత్తా ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఓటీటీ సిరీస్‌తో టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేస్తోంది. దివ్యా దత్తా నటించిన లేటెస్ట్ తెలుగు పొలిటికల్ ఓటీటీ వెబ్ సిరీస్ మయసభ.

ప్రస్థానం, ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలను తెరకెక్కించిన పాపులర్ డైరెక్టర్ దేవ కట్టా మయసభ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఆయనతోపాటు ఈ సిరీస్‌కు కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్ర...