భారతదేశం, ఆగస్టు 6 -- బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్య దత్తా ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. సోనీ లివ్ ఓటీటీలోకి రాబోతున్న 'మయసభ' (Mayasabha) వెబ్ సిరిస్ తో తెలుగు ఆడియన్స్ ను పలకరించబోతోంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన 'చావా' సినిమాలో కుట్రపూరిత సోయరాబాయి క్యారెక్టర్ ప్లే చేసింది దివ్య దత్తా. ఇప్పుడు తెలుగులోకి అడుగు పెడుతున్న సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న సోనీ లీవ్ వెబ్ సిరీస్ 'మయసభ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది దివ్య దత్తా. "చావా అదరగొడుతుందని నాకు తెలుసు. కానీ ఇంతటి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని దివ్య దత్తా పేర్కొంది. "2024, 2025 నాకు ...